తెలంగాణ గళం, వీణవంక (నవంబర్ 21): వీణవంక మండలం వల్భాపూర్ గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ’ శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది.
వల్భాపూర్ సర్పంచ్ అందె శ్రీమతి కుమార్, ఉప సర్పంచ్ నామని విజయేందర్ ఈ కార్యక్రమాన్ని అర్హత కలిగిన లబ్ధిదారుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ, భవిష్యత్తులో కుటుంబాలకు ఆసరాగా నిలవడమే దీని ప్రధాన లక్ష్యమని, ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచిత బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు గల వారు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు.
ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల స్థానికులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వల్భాపూర్‌లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం
తెలంగాణ గళం, వీణవంక (నవంబర్ 21): వీణవంక మండలం వల్భాపూర్ గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ’ శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది.వల్భాపూర్ సర్పంచ్ అందె శ్రీమతి కుమార్, ఉప సర్పంచ్ నామని విజయేందర్…
By తెలంగాణ గళం · · Updated
Share this article



