సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో పాల్గొన్న అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లిన మహిళా కాంగ్రెస్ శ్రేణులు


రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ గళం, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):
భారత రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ మార్చ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సందీప్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లి మార్చ్‌లో పాల్గొన్నారు.
లిబర్టీ సర్కిల్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మహిళా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు సంఘీభావం తెలిపారు.



