కరీంనగర్

హిమాలయ శిఖరంపై రెపరెపలాడిన జాతీయ జెండా.. శాతవాహన NSS వాలంటీర్ల అరుదైన సాహసం!

ధర్మశాల / కరీంనగర్: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహిస్తున్న జాతీయ సాహస శిబిరంలో శాతవాహన విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తమ సాహస ప్రతిభను చాటారు. కంటింజెంట్ లీడర్ డాక్టర్ కాంపెల్లి అర్జున్ నే…

By · · Updated

Share this article

ధర్మశాల / కరీంనగర్: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహిస్తున్న జాతీయ సాహస శిబిరంలో శాతవాహన విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తమ సాహస ప్రతిభను చాటారు. కంటింజెంట్ లీడర్ డాక్టర్ కాంపెల్లి అర్జున్ నేతృత్వంలో 10 మంది వాలంటీర్లు సుమారు 2,828 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ ట్రియుండ్ పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. శిఖరాగ్రంపై జాతీయ జెండాతో పాటు ఎన్ఎస్ఎస్ పతాకాన్ని ఎగురవేసి 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు.

 

రీజినల్ మౌంటెనీరింగ్ సెంటర్ డైరెక్టర్ జితేందర్, ఇన్‌స్ట్రక్టర్స్ బృందం మార్గదర్శకత్వంలో ఈ యాత్ర సాగింది. కఠినమైన కొండ మార్గాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ వాలంటీర్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ యాత్ర విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తిని పెంపొందించిందని డాక్టర్ అర్జున్ తెలిపారు.

 

ఈ సాహసయాత్రలో అద్వైత్, అజయ్, శ్రీకాంత్, సంతోష్, ఓం ప్రకాష్, అనిత, మనీషా, దివ్య, నందిని, తేజశ్రీ పాల్గొన్నారు. వాలంటీర్ల బృందాన్ని శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఇ. మనోహర్, ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తదితరులు అభినందించారు.

Tags: