చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి నిమిత్తం మాజీ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి గారు తన వంతు సహాయంగా రూ. 51,000 (యాభై ఒక్క వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.
ఆలయ అభివృద్ధి పనులకు మరియు నిత్య పూజా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొలిపాక వేణు జెనరల్ సెక్రటరీ కాసాని సతీష్ మరియు కమిటీ సభ్యులు మామిడి అంజయ్య పంకెర్ల రాజు బోయిని సంజీవ్ లు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి రూ. 51 వేల విరాళం అందజేసిన మాజీ ఎం.పి.పి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి నిమిత్తం మాజీ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి గారు తన వంతు సహాయంగా రూ. 51,000 (యాభై ఒక్క వేల రూపాయలు) విరాళంగా…
By తెలంగాణ గళం · · Updated
Share this article



