
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సామాజి కార్యకర్త అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేసి ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యానికి పునాది, ప్రతి పౌరుడు హక్కులను హక్కులకు రక్షణ కవచం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం సమానత్వం ,స్వేచ్ఛ ,న్యాయం అనే గొప్ప విలువలను మనకు అందించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు ప్రతి పౌరుడు తన సేవ ,బాధ్యతలు కూడా గుర్తించాలి. కులమత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరికీ సమాన గౌరవం కల్పించాలని, ముఖ్యంగా యువత రాజ్యాంగం పై అవగాహన పెంచుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పాఠశాల నుంచే విద్యార్థులకు అందజేయాలని అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం సమాజం పట్ల బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని అన్నారు.



