కరీంనగర్

సగరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

• సగరులని బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి చేర్చాలి... • 50 ఏళ్లకి ఫించన్ మంజూరు చేయాలి.... • ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సగరులకి తగిన ప్రాధాన్యత కల్పించాలి.... • ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి వినతిపత్రం…

By · · Updated

Share this article
సగరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

• సగరులని బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి చేర్చాలి...

• 50 ఏళ్లకి ఫించన్ మంజూరు చేయాలి....

• ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సగరులకి తగిన ప్రాధాన్యత కల్పించాలి....

• ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి వినతిపత్రం అందజేసిన కరీంనగర్‌ సగర సంఘం నాయకులు

 

తెలంగాణ గళం, హుజూరాబాద్‌ (నవంబర్ 24) :

అనాదిగా నిర్మాణ రంగంతో ముడిపడి జీవనం సాగిస్తున్న సగర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కరీంనగర్‌ జిల్లా సగర సంఘం నాయకులు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని కోరారు.

తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారి కానిగంటి శ్రీనివాస్‌ సగర, జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్‌ సగర, ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు.

సగరులను ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, గీత కార్మికులకు కల్పిస్తున్న తరహాలో 50 ఏళ్లకే పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. సగర ఫెడరేషన్‌ను పూర్తిస్థాయి సంక్షేమ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగర లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఈఎండీ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణ రంగంలో కష్టపడి పనిచేస్తున్న సగర కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, పింఛన్‌ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

సగరుల ఆరాధ్య దైవం భగీరథ మహర్షి విగ్రహాన్ని హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, హుజూరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో సగర కమ్యూనిటీ భవన నిర్మాణానికి, విద్యార్థుల వసతిగృహం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. ఈ సదుపాయాలు సగర సమాజ ఐక్యతకు, యువత విద్యాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

సగర (ఉప్పర) సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు సగరులు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు గుంటి శ్రీనివాస్‌ సగర, నలుబాల వేణుగోపాల్‌ సగర, గుంటి అశోక్‌ సగర, కురిమిండ్ల రాజు సగర, యంజాల వాసు సగర, దేవునూరి రాజేందర్‌ సగర, కురిమిండ్ల మల్లయ్య సగర, సట్లపల్లి నగేష్‌ సగర, నలుబాల మధు సగర, అనిశెట్టి సతీష్‌ సగర, అనిశెట్టి సాంబశివ సగర, నలుబాల రాము సగర, దొనికెన చంద్రమౌళి, కానిగంటి కిరణ్‌, కానిగంటి శ్రీనివాస్‌, కురిమిండ్ల సుదర్శన్‌, కురిమిండ్ల సంతోష్‌, కొల్లూరి సాంబయ్య, కొల్లూరి మధు తదితర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.