- ఐరన్ లెగ్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి
- స్వంత గ్రామానికి రోడ్డు పోసుకోలేని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
- విలేకరుల సమావేశంలో కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్
కమలాపూర్, తెలంగాణ గళం:
కమలాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, బండి కళాధర్ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ అభివృద్ధి ఈటల రాజేందర్ వలనే జరిగింది. అనేది జగమెరిగిన సత్యం. ఐరన్ లెగ్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి అని విమర్శించారు. తను అడుగు పెట్టిన పార్టీ భస్మం అవుతుంది ఖాయం. తన స్వంత గ్రామానికి రోడ్డు పోసుకోలేని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అక్రమ మార్గంలో పదవి పొందిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. ప్రజా నాయకుడు ఈటలను విమర్శించే స్థాయి నీది కాదు. కేసీఆర్ అభివృద్ధి చేశాడని అనడం హాస్యాస్పదం. మిగతా నియోజక వర్గాల్లో ఎందుకు అభివృద్ధి అవ్వలేదు. నియోజక వర్గంలో ఉన్న రోడ్లు,ప్రభుత్వ భవనాలు, విద్యాలయాలు,ఆసుపత్రి ప్రతి ఒకటి ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి మరోసారి ఈటల రాజేందర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, హుజురాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బండి కళాధర్, శనిగరం సర్పంచ్ కొత్తపల్లి రాజు, బుర్ర కరుణాకర్, తుమ్మ శోభన్ బాబు, కనుకుంట్ల అరవింద్, కొండం శ్రీనివాస్, ఇనుగాల రత్నాకర్, పెండ్యాల తిరుపతి రెడ్డి, తూర్పాటి భాస్కర్, పుల్ల అద్భుత రావు, మార్క అశోక్, పిల్లి సతీష్, రాంశెట్టి రాజయ్య, పంజాల సారయ్య, చెలిక శ్రీనివాస్, మౌటం రమేష్ బాబు, అర్వపల్లి సామ్రాజ్యం గౌడ్, కొండమీదీ రవి, తూర్పాటి క్రాంతి, మౌటం సుభాష్, జక్కుల రమేష్, మునిగే రాజు, రాణప్రతాప్, ఓదెలు, సాంబయ్య, మౌటం సంపత్, ర్యాకం సంపత్, కట్కుకూరి శంకర్, పచ్చిమట్ల కుమారస్వామి, బైరీ రాజేష్, చేనుమల్ల రంజిత్, ప్రభాకర్ రెడ్డి, సుమన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





