కరీంనగర్: నగరంలోని 15వ డివిజన్ శాంతినగర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన టాయిలెట్ బ్లాక్‌ను మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు గురువారం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా నూతన టాయిలెట్ బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల పాఠశాల వర్గాలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు మరుగుదొడ్ల సౌకర్యం ఎంతో అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి. జ్యోతి, కార్పొరేటర్ బండ రమణారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుగులోత్ విజయదేవి, సదానందం నాయక్, జిల్లా బీజేపీ కార్యదర్శి గుండేటి శివ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమరయ్య, శివ, కొత్తపల్లి జోన్ అధ్యక్షులు హరీష్, సతిరెడ్డి, రవి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.




