తెలంగాణ గళం - కరీంనగర్ ఆర్.సి.
తేదీ: 18 నవంబర్, 2026
కరీంనగర్ / కొత్తపల్లి: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. కొత్తపల్లి మండల పరిధిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కొత్తపల్లి మండల అధ్యక్షులు కుంట తిరుపతి, వెస్ట్ జోన్ అధ్యక్షులు జాడి బాలిరెడ్డి, ఖాజీపూర్ సర్పంచ్ అంజన్ ప్రసాద్, కామనపూర్ సర్పంచ్ ప్రవీణ్, ఉపసర్పంచ్ నరేష్ పాల్గొన్నారు. వీరితో పాటు గుండేటి శివకుమార్, కొమురయ్య, గుగులోతు సదానందం నాయక్, రతన్, అనిల్ కుమార్, రేనయ్య, శ్రీనివాస్, సతీరెడ్డి, ప్రశాంత్, హరికృష్ణ మరియు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు




