🙏 ఓం నమఃశివాయ 🙏
గౌరవ సంఘ సభ్యులకు మరియు భక్తమహాశయులకు కైలాసగిరి శివాలయ కమిటీ మరియు అధ్యక్షుల తరపున ఆత్మీయ ఆహ్వానం!
కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా కైలాసగిరి శివాలయంలో ఈ క్రింది ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి:
🔱 కార్యక్రమ వివరాలు:
ఉదయం 5:00 నుండి 11:30 వరకు: స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు
సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు: కన్నులపండువగా జ్వాలాతోరణం, పల్లకి సేవ మరియు మహా హారతి
రాత్రి 7:30 అనంతరం: భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ (Dinner)
కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో సాయంత్రం కైలాసగిరి శివాలయానికి విచ్చేసి, ఈ పవిత్ర కార్యక్రమాలలో పాల్గొని, ఆ పరమశివుని కృపాకటాక్షాలకు పాత్రులై, అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్లాలని ఆలయ కమిటీ వారు కోరుకుంటున్నారు.
🙏 ఓం నమః
శివాయ 🙏



