తాజా వార్తలు

కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

**కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి**   - బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ - బీఆర్ఎస్‌లో చేరిన కొమ్ముగూడెం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు - గులాబీ కండువాలు కప్పి పార్…

By · · Updated

Share this article
కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

**కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి**

 

- బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్

- బీఆర్ఎస్‌లో చేరిన కొమ్ముగూడెం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

- గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం

కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఉట్నూర్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జాన్సన్ నాయక్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. తెలంగాణ తిరిగి అభివృద్ధి పథంలో పయనించాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. జాన్సన్ నాయక్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: