చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని యాదవ కులస్తుల ఐక్యత, సామాజిక అభ్యున్నతి మరియు సంక్షేమమే లక్ష్యంగా రేకొండ యాదవ సంఘం నూతన అధ్యక్షుడిని గా పంకెర్ల రాజు ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పంకెర్ల రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన కుల పెద్దలకు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని యాదవ కుటుంబాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, అందరినీ కలుపుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా యాదవ కులస్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం సంఘం సభ్యులు నూతన అధ్యక్షులు పంకెర్ల రాజును శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం డైరెక్టర్లు మరియు యాదవ కులస్థులు పాల్గొన్నారు.



