కరీంనగర్

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

  తెలంగాణ గళం, మానకొండూరు మండల రిపోర్టర్ (నవంబర్21): కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లవూడ్య చమన్ లాల్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు…

By · · Updated

Share this article
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

 

తెలంగాణ గళం, మానకొండూరు మండల రిపోర్టర్ (నవంబర్21): కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లవూడ్య చమన్ లాల్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

 ఫిర్యాదుదారుడి కోడలికి వితంతు పెన్షన్ మంజూరు చేయించేందుకు కార్యదర్శి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడి ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.

🔚

Tags: