కరీంనగర్

అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నవంబర్ 24న ఉచిత వైద్య శిబిరం

    • రుమటాలజీ, చర్మవ్యాధుల నిపుణులతో వైద్య సేవలు • ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: నిర్వాహకులు   తెలంగాణ గళం, జమ్మికుంట ప్రతినిధి రాజ్‌కుమార్ వెన్నెల, (నవంబర్ 22) :        జమ్మికుంట…

By · · Updated

Share this article

 

 

• రుమటాలజీ, చర్మవ్యాధుల నిపుణులతో వైద్య సేవలు

• ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: నిర్వాహకులు

 

తెలంగాణ గళం, జమ్మికుంట ప్రతినిధి రాజ్‌కుమార్ వెన్నెల, (నవంబర్ 22) : 

      జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్‌లో ఉన్న అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నవంబర్ 24వ తేదీ మంగళవారం నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.

ఈ శిబిరంలో రుమటాలజిస్ట్, కీళ్లవాతం నిపుణుడు డాక్టర్ వి. కృష్ణకాంత్, చర్మవ్యాధుల నిపుణుడు డాక్టర్ సతీష్ రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించనున్నారు.

జమ్మికుంట పట్టణ, మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ బొజ్జం చాందిని సంతోష్ రెడ్డి కోరారు. సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శిబిరానికి హాజరై వైద్య నిపుణుల సలహాలు, చికిత్స పొందాలని సూచించారు.

ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని తెలిపారు. శిబిరానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9959744380, 9030444380 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

Tags: