తాజా వార్తలు

యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 'సదర్ సమ్మేళనం' వేడుకలు – మాస్టర్ గోరిగే రిత్విక్ పుట్టినరోజు సంబరాలు

ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 07 (తెలంగాణ గళం): సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే యాదవ్‌ల ఆరాధ్య పండుగ అయిన 'సదర్ సమ్మేళనం' వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల…

By · · Updated

Share this article
యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 'సదర్ సమ్మేళనం' వేడుకలు – మాస్టర్ గోరిగే రిత్విక్ పుట్టినరోజు సంబరాలు

ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 07 (తెలంగాణ గళం): సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే యాదవ్‌ల ఆరాధ్య పండుగ అయిన 'సదర్ సమ్మేళనం' వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా యాదవ్‌లు తమ ఆరాధ్య దైవమైన శ్రీ కృష్ణుడిని స్మరించుకుంటూ, తమ సంస్కృతిని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన దున్నపోతును సాంప్రదాయబద్ధంగా పూలమాలలు, గంటలు, రంగురంగుల వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరూ దున్నపోతును ఆప్యాయంగా పలకరిస్తూ, దాని చుట్టూ కోలాహలంగా గడుపుతూ తమ సంప్రదాయాన్ని ఘనంగా చాటుకున్నారు. యువకులు, మహిళలు ఎర్రటి కండువాలు ధరించి సంబరాల్లో జోరుగా పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా ఫణిందర్, నవీన్ యాదవ్, కుమార్, సుధాకర్, మెసయ్య , నాగరాజ్, అబ్బయ్య, యాదగిరి, శ్రీనివాస్, గోరిగే నరసింహ కురుమ, వచ్చరు హాజరయ్యారు. ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడంలో కమిటీ సభ్యులు దయాకర్ యాదవ్, గోరిగే శ్రీనివాస్, వనేష్, మంగ మధు, గోరిగే సాగర్ ముఖ్య భూమిక పోషించారు. వీరితో పాటు భాస్కర్, సుధీర్, మధు, బండారి శ్రీను, బండారి భాస్కర్, వెంకటేష్, శ్రీనివాస్, వర్షిత్, చెరి, సన్నీ తదితరులు పాల్గొని వేడుకల శోభను ద్విగుణీకృతం చేశారు. ఈ సదర్ సమ్మేళనం వేడుకల్లో చిన్నారి గోరిగే రిత్విక్ పుట్టినరోజు వేడుకను అందరి సమక్షంలో కేక్ కట్ చేసి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి రిత్విక్ కేక్ కట్ చేసిన దృశ్యం ఈ వేడుకలకు మరింత ఆనందాన్ని, ప్రత్యేక శోభను తెచ్చిపెట్టింది. హాజరైన పెద్దల ఆశీర్వాదాలు, బంధుమిత్రుల శుభాకాంక్షలు మరియు కేరింతల మధ్య రిత్విక్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఆనందకర వాతావరణంలో ముగిశాయి. 'జై యాదవ్ - జై మాధవ్' నినాదాలతో కూడిన భారీ ఫ్లెక్సీల మధ్య, యాదవ సంఘం నాయకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సదర్ వేడుకలు యాదవ బంధువుల మధ్య ఐక్యతను, అన్యోన్యతను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడ్డాయని, పశు సంపదను కాపాడుకోవడం మన సాంప్రదాయమని ఈ వేడుకలు మరోసారి నిరూపించాయని నిర్వాహకులు తెలిపారు.

Tags: