బేతుపల్లి పెద్ద చెరువు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన కాశీరాం.. ఇంటికి వెళ్లి పరామర్శించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్.
By Lakavath Sudhir:
టేకులపల్లి, నవంబర్ 8 (తెలంగాణ గళం): విధి నిర్వహణలో ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడిన చాతకొండ SDRF 6వ బెటాలియన్ సిబ్బంది తేజావత్ కాశీరాంను ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ ఆదివారం పరామర్శించారు. టేకులపల్లి మండలం పెగల్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పుగూడెంలో ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన SDRF బృందం బోటు వరద ఉద్ధృతికి బోల్తా పడింది. ఈ ఘటనలో కాశీరాం ప్రమాదంలో చిక్కుకుని అనంతరం సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలను కోరం సురేందర్ కొనియాడారు. శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో SDRF సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, సర్పంచ్ కోరం హనుమంతు, నాయకులు ఈది గణేష్, పోశాలు, భద్రు, సుధాకర్, శివ, హరి, సుఖ్య, భద్రు నాయక్, సర్దార్ నాయక్, చింత కళ్యాణ్, బన్సీలాల్, కోటి, రవి తదితరులు పాల్గొన్నారు.



