
గ్రామానికి చెందిన మహిళ ఉన్నత ప్రభుత్వ హోదా చేపట్టడంపై హర్షం.. పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దల అభినందనలు
మెట్పల్లి, నవంబర్ 04,తెలంగాణ గళం:
పట్టుదల, కృషి, అంకితభావంతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని నిరూపిస్తూ మెట్పల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బత్తుల స్వప్న కథలాపూర్ మండల డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. స్వప్న నూతన బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బస్ మహేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బూరం రాజేష్, మెట్పల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బెదగం శేఖర్, గ్రామ పెద్దలు కొమిరెడ్డి మోహన్ రెడ్డి, మోర్తాడ్ మురళి, కొమిరెడ్డి రవి, ధనవేని శ్రీనివాస్, ఇల్లెందుల అరుణ్,పాషా, బెదుగం బాబయ్య, అందే శ్రీనివాస్,బెదుగం నరేందర్,రమేష్, గోపునవేణి కుమార్,కొమిరెడ్డి నికిల్,బూరం నర్సయ్య తదితరులు బత్తుల స్వప్నను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన స్వప్న ప్రభుత్వ రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టడం గ్రామానికి గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక నిరంతర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయని పేర్కొన్నారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రజలకు చేరవేయడంలో తనదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు.
గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన స్వప్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు.



