తాజా వార్తలు

ఉమ్మడి చిలుకానగర్ అభివృద్ధికి ప్రాధాన్యం: అధికారులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాలు

****   ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 9 (తెలంగాణ గళం): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి చిలుకానగర్ డివిజన్‌లో మురుగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా నూతన డ్రైనేజీ మ…

By · · Updated

Share this article

****

 

ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 9 (తెలంగాణ గళం): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి చిలుకానగర్ డివిజన్‌లో మురుగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా నూతన డ్రైనేజీ మరియు వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేయాలని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తాగునీటి మరియు డ్రైనేజీ పైప్‌లైన్ల పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ జీఎం సంతోష్‌తో పాటు డీజీఎంలు, వివిధ డివిజన్ల మేనేజర్లు పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా ఉమ్మడి చిలుకానగర్ డివిజన్ పరిధిలో తక్షణమే చేపట్టాల్సిన పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను చిలుకానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మరియు స్థానిక నాయకులు కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి అందజేశారు. నివేదికలోని ప్రతి అంశంపైనా ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. చిలుకానగర్ డివిజన్‌లో గుట్టపై ఉన్న మార్కండేయ టెంపుల్ ఎదురు వీధి, కుమ్మరి కుంట, నవోదయ కమ్యూనిటీ హాల్ పక్క వీధి, మల్లికార్జున్ నగర్ అవుట్‌లెట్, పీర్ల కొట్టం నుండి మల్లికార్జున్ నగర్ అవుట్‌లెట్, చిల్కానగర్ మర్రిచెట్టు ప్రాంతం, మరియు మహిళా భవన్ వెనుక వీధిలో నూతన సేవరైజ్ పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే బీరప్ప గడ్డ డివిజన్ పరిధిలోని కళ్యాణపురి చెన్నయ్య వీధి, విశాతత్ ఎంక్లేవ్, రాఘవేందర్ నగర్ కాలనీ, కళ్యాణపురి మర్రిచెట్టు ప్రాంతం, బాలాజీ ఎంక్లేవ్ రమణన్న వీధి, మరియు శ్రీనగర్ కాలనీలోని పలు వీధుల్లో నూతన సేవరైజ్ పైప్‌లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, పనుల ప్రతిపాదనలను వేగవంతం చేసి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కొక్కొండ జగన్, జల్లి మోహన్, ముద్దం శ్రీనివాస్ యాదవ్, మాస శేఖర్, రామాంజనేయులు, ఎండి షఫీ, అబ్బు భాయ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: