తెలంగాణ గళం - కరీంనగర్
ఆర్.సి. ప్రభాకర్
కరీంనగర్ లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ లారీ డ్రైవర్
కరీంనగర్: శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి లారీ నడుపుతున్న డ్రైవర్‌ను పట్టుకున్నారు.
అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆపి తనిఖీ చేయగా, బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో డ్రైవర్ మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో లారీని సీజ్ చేసి, డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.


