ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో కేక్ కట్.. సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
By Lakavath Sudhir:
టేకులపల్లి, నవంబర్ 8 (తెలంగాణ గళం): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వేడుకలకు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం ప్రజాసేవలో కొనసాగాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, మండల నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, మధురెడ్డి, సరిత, సంజయ్, సర్దార్ నాయక్, నాగేశ్వరరావు, రవి, వెంకన్న, హరి, కోరం హనుమంతు, సైదులు, నర్సయ్య, నగేష్, ఈశ్వర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



