తాజా వార్తలు

శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్‌కు ఆహ్వానం

  ఆలయ ప్రతిష్ఠాపనకు హాజరుకావాలని కోరిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్   మెట్‌పల్లి, నవంబర్ 14,తెలంగాణ గళం:    రాజేశ్వర్‌రావుపేట గ్రామంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ అభయ హస్త ఆ…

By · · Updated

Share this article
శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్‌కు ఆహ్వానం

 

ఆలయ ప్రతిష్ఠాపనకు హాజరుకావాలని కోరిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్

 

మెట్‌పల్లి, నవంబర్ 14,తెలంగాణ గళం:

 

 రాజేశ్వర్‌రావుపేట గ్రామంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరుకావాలని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ కాటా లక్ష్మి-శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠతో పాటు శివ పంచాయతన, నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

 

ఆదివారం జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని, ప్రత్యేక పూజల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కోరారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

గ్రామంలో ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తుల సహకారం, గ్రామస్తుల భాగస్వామ్యంతో నిర్వహించబడుతుండగా, మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

Tags: