తాజా వార్తలు

శ్రమదానంతో పురాతన బావి శుభ్రం 

కమలాపూర్స్వ, తెలంగాణ గళం: స్వఛ్చ కమలాపూర్‌ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లోని పురాతన రామగుండం భావి శుభ్రం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ…

By · · Updated

Share this article
శ్రమదానంతో పురాతన బావి శుభ్రం 

కమలాపూర్స్వ, తెలంగాణ గళం:

స్వఛ్చ కమలాపూర్‌ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఊరు కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లోని పురాతన రామగుండం భావి శుభ్రం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ సహా వార్డు సభ్యులు ఈ శనివారం ఊరుకోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమం 1,2 వ వార్డుల్లో నిర్వహించారు. బావితోపాటు మురికి కాలువలు, రోడ్లు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అనేక కరువు కాటకాలు వచ్చిన సమయంలో గ్రామాన్ని ఇదే బావి ఆడుకుంది. అటువంటి బావిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులు అందరిపై ఉందన్నారు. శుభ్రం చేసిన బావిని పరిశుభ్రంగా పరిరక్షించుకోవాలని గ్రామస్తులను సర్పంచ్ కోరారు.  ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు మార్క అశోక్, అవునూరి తిరుపతి, పిల్లి సతీష్, ఎండపెల్లి మల్లారెడ్డి, మౌటం నాగరాజు, పుల్ల ఐలయ్య,  బాలసాని కుమారస్వామి, పచ్చిమట్ల కుమారస్వామి, ప్రగతి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొంతకొండ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Tags: