సఫా బైతుల్ మాల్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం పంపిణీ
ఉట్నూర్, నవంబర్ 10 (తెలంగాణ గళం ):
సఫా బైతుల్ మాల్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే నెలవారీ సమీక్ష, సంప్రదింపులు మరియు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం నవంబర్ 10, 2026న ఉట్నూర్‌లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సఫా బైతుల్ మాల్ ఉట్నూర్ శాఖ అధ్యక్షులు మౌలానా సయ్యద్ రిజ్వాన్ అసదీ సంస్థ నిర్వాహకుడు మహమ్మద్ అజ్మత్ను కలిసి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. రానున్న రోజుల్లో సంస్థ ద్వారా చేపట్టే సేవా, సహాయ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్‌కు చెందిన 8 మంది నిరుపేద అర్హులైన పురుషులు, మహిళలకు మొత్తం రూ.40,000 ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు అహ్మద్ బియాబానీ, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మౌలానా సయ్యద్ రిజ్వాన్ అసదీ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.


