తాజా వార్తలు

రైతు వేదికను సందర్శించిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు

శివ్వంపేట, నవంబర్ 2 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని రైతు వేదికను మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ (SOAS)కు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సంద…

By · · Updated

Share this article
రైతు వేదికను సందర్శించిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు

శివ్వంపేట, నవంబర్ 2 (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని రైతు వేదికను మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ (SOAS)కు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సందర్శించారు. కె.వి.కె. తునికి శాస్త్రవేత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం (RAWEP)లో భాగంగా ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులను కలిసి రైతు వేదిక ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతుల కోసం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన పొందారు.రైతులకు రైతు వేదిక ఏ విధంగా ఉపయోగపడుతుంది, వ్యవసాయ అభివృద్ధిలో దాని పాత్ర ఏమిటనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కలిగింది.ఈ కార్యక్రమంలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సిరి మహేశ్వరి, వైష్ణవి, వర్షిణి, శరణ్య పాల్గొన్నారు.

Tags: