తాజా వార్తలు

రామచంద్రాపురంలో ఘనంగా దీపావళి వేడుకలు: కుటుంబ సమేతంగా లక్ష్మీపూజ చేసిన తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ... ​దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో గల తమ నివాసంలో తాజా మాజీ కార్…

By · · Updated

Share this article
రామచంద్రాపురంలో ఘనంగా దీపావళి వేడుకలు: కుటుంబ సమేతంగా లక్ష్మీపూజ చేసిన తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ...

​దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో గల తమ నివాసంలో తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా లక్ష్మీదేవి పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించి, ఆశీస్సులు అందుకున్నారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామచంద్రాపురం డివిజన్ కాలనీ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలతో జీవించాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.