దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని సిఎంసి (CMC) కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ మరియు పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పృథ్వీరాజ్ గారు పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది మరియు MDR యువసేన సభ్యులు పాల్గొన్నారు.



