తెలంగాణ గళం నవంబర్ 20(కడం):-
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత (ఆసరా) సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద దిల్దార్ నగర్ గ్రామంలో నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు గురువారం నాడు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ ఉప సర్పంచ్ పొన్నం ఆనంద్ గౌడ్ గారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన లబ్ధిదారులందరికీ నవంబర్ 26 నుండి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ అవుతుందని తెలిపారు. లబ్ధిదారులందరూ తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం (NPCI) పూర్తయిందో లేదో ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూమేష్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



