తాజా వార్తలు

నిరుద్యోగ సమస్యపై PYL యుద్ధభేరి.. ఐటీడీఏ ముట్టడికి సిద్ధం!

గిరిజన యువతకు ఉపాధి కల్పించడంలో అధికారుల వైఫల్యంపై ఆగ్రహం.. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక! Lakavath Sudhir: ఇల్లందు, నవంబర్‌ 11 (తెలంగాణ గళం): దేశంలో నిరుద్యోగ సమస్య రోజ…

By · · Updated

Share this article
నిరుద్యోగ సమస్యపై PYL యుద్ధభేరి.. ఐటీడీఏ ముట్టడికి సిద్ధం!

గిరిజన యువతకు ఉపాధి కల్పించడంలో అధికారుల వైఫల్యంపై ఆగ్రహం.. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక!

Lakavath Sudhir:

ఇల్లందు, నవంబర్‌ 11 (తెలంగాణ గళం): దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రగతిశీల యువజన సంఘం (PYL) రాష్ట్ర కమిటీ సభ్యుడు మోతిలాల్‌ విమర్శించారు. ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీడీఏ ఉన్నప్పటికీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఆరోపించారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించలేని ఐటీడీఏ వల్ల ప్రయోజనమేమిటని ప్రశ్నించారు.

గ్రామీణ ప్రాంతాల్లో యువత డ్రగ్స్‌, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం, కులం పేరుతో మూఢనమ్మకాలను ప్రోత్సహించడం, అశ్లీల చిత్రాలు, విదేశీ సంస్కృతి ప్రభావం యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిణామాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే యువత తరఫున పోరాటం ఉద్ధృతం చేస్తామని, నిరుద్యోగులతో కలిసి ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు.

నవంబర్‌ 30న జిల్లా మహాసభ

కొత్తగూడెంలో నవంబర్‌ 30న నిర్వహించనున్న PYL భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభను విజయవంతం చేయాలని మోతిలాల్‌ పిలుపునిచ్చారు. నిరుద్యోగం, ఉపాధి సమస్యలపై చర్చించి యువత భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు మహాసభ వేదిక కానుందని తెలిపారు. యువత అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి మహాసభను జయప్రదం చేయాలని కోరారు. బుధవారం ఇల్లందులో రావూరి ఉపేందర్‌ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో PYL నాయకులు రావూరి ఉపేందర్‌, సీతారామరాజు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.