ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 08 (తెలంగాణ గళం): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ నాలమాసు వెంకటేష్ గారి నివాసంలో "కేదారేశ్వర స్వామి నోములు" (వ్రతం) ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. శ్రీ నాలమాసు సౌజన్య - వెంకటేష్ దంపతులు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి, స్వామివారికి పవిత్ర నిష్టతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచే నాలమాసు వెంకటేష్ గారి ఇల్లు భక్తిశ్రద్ధలతో, అలంకరణలతో కళకళలాడింది. ఈ సందర్భంగా పూజా మండపంలో కేదారేశ్వర స్వామి వారిని కొలువుదీర్చి, దివ్య నైవేద్యాలు, పలితాలు సమర్పించారు. సమాజం సుభిక్షంగా ఉండాలని, కుటుంబాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ ప్రత్యేక అర్చనలు, మంగళ హారతులు ఇచ్చారు. ఈ పవిత్ర వేడుకకు పలువురు ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, సుధీర్, గణేష్, మంధు, బండారి భాస్కర్, బండారి శ్రీను, దయాకర్, గోరిగే శ్రీను, మంగ మధు, శ్రీనివాస్, గోరిగే సాగర్, చెరి, వర్షిత్, సన్నీ, సాకేత్ లతో పాటు మరికొందరు ముఖ్యులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులందరికీ నాలమాసు సౌజన్య-వెంకటేష్ దంపతులు స్వాగతం పలికి సత్కరించారు. వ్రతం పూర్తయిన అనంతరం విచ్చేసిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దైవ దర్శనం అనంతరం అందరికీ ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. పండుగ వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఈ వేడుకను జరుపుకోవడం విశేషంగా నిలిచింది.
నాలమాసు వెంకటేష్ గారి ఇంట భక్తిశ్రద్ధలతో "కేదారేశ్వర నోములు
ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 08 (తెలంగాణ గళం): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ నాలమాసు వెంకటేష్ గారి నివాసంలో "కేదారేశ్వర స్వామి నోములు" (వ్రతం) ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో…
By తెలంగాణ గళం · · Updated
Share this article



