తాజా వార్తలు

లలిత కళా సమితి స్థలంలో అక్రమ కట్టడాలు తొలగించాలి పాత బస్టాండ్‌లో సమితి సభ్యుల రిలే నిరాహార దీక్ష

  19 గుంటల స్థలం ఆక్రమణకు గురైందని ఆరోపణ.. అధికారులకు వినతి   మెట్‌పల్లి, నవంబర్ 04,తెలంగాణ గళం:    పట్టణంలోని లలిత కళా సమితికి చెందిన స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించి, తమకు…

By · · Updated

Share this article
లలిత కళా సమితి స్థలంలో అక్రమ కట్టడాలు తొలగించాలి     పాత బస్టాండ్‌లో సమితి సభ్యుల రిలే నిరాహార దీక్ష

 

19 గుంటల స్థలం ఆక్రమణకు గురైందని ఆరోపణ.. అధికారులకు వినతి

 

మెట్‌పల్లి, నవంబర్ 04,తెలంగాణ గళం:

 

 పట్టణంలోని లలిత కళా సమితికి చెందిన స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమితి సభ్యులు బుధవారం మెట్‌పల్లి పాత బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సమితికి చెందిన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని ప్రీకాస్ట్ గోడలు నిర్మించారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.

 

ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. మెట్‌పల్లి పట్టణంలో లలిత కళా సమితికి చెందిన సుమారు 19 గుంటల స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి ప్రీకాస్ట్ గోడలు నిర్మించడంతో సమితికి చెందిన స్థలానికి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమితి ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన స్థలం ఆక్రమణకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

సమితికి చెందిన స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి స్థలాన్ని పరిశీలించాలని, ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణ అయితే అక్రమ కట్టడాలను తొలగించి స్థలాన్ని సమితికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

 

తమ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా జిల్లా, మున్సిపల్ అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు.

Tags: