పవిత్ర కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కైలాసగిరి శివాలయం: ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, సాయంత్రం భక్తిశ్రద్ధలతో శివసహస్రనామ బిల్వార్చన జరిగింది. అనంతరం మహా హారతితో నేటి పూజా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి.
తెల్లాపూర్ (263 డివిజన్): ఇక్కడి శ్రీ బీరప్ప మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి సోమవారం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో దేవాలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి
.



