ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 07 (తెలంగాణ గళం):ఈసీఎల్ చౌరస్తాలోని ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ కార్యాలయంలో దీపావళి పండగను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కే. వెంకటేశ్వర్లు ఖాతాదారులకు, ఏజెన్సీ అడ్వైజర్లకు, యూనిట్ మేనేజర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత ఎంతో కీలకమని, దురదృష్టవశాత్తూ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కుటుంబాలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచే ప్రొటెక్షన్ పాలసీలు, టర్మ్ పాలసీలు తీసుకోవాలని ఆయన సూచించారు. వీటితో పాటు పిల్లల ఉన్నత చదువులు, విదేశీ విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడే స్మార్ట్ స్కాలర్, చైల్డ్ పాలసీలు మరియు హామీతో కూడిన రాబడిని అందించే గ్యారెంటీడ్ నాన్-పార్ ప్రాడక్టులు, పెన్షన్ పథకాలు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీ. మధు, వి. రవి, బీ. సునీత, ఎం. సాగర్, ఎస్. మహేష్, బీ. నరేష్, వి. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విధానాలు మరియు పథకాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈసీఎల్ చౌరస్తా సాయిబాబా గుడి పక్కన ఉన్న బ్రాంచ్ కార్యాలయాన్ని గానీ, లేదా స్థానిక అడ్వైజర్లను గానీ సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈసీఎల్ చౌరస్తా ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్లో దీపావళి వేడుకలు: ఖాతాదారులు, సిబ్బందికి మేనేజర్ వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు
ఉప్పల్ ప్రతినిధి గోరిగే సాగర్ నవంబర్ 07 (తెలంగాణ గళం):ఈసీఎల్ చౌరస్తాలోని ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ కార్యాలయంలో దీపావళి పండగను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజ…
By తెలంగాణ గళం · · Updated
Share this article



