By Lakavath Sudhir
ఇల్లందు, అక్టోబర్ 19 (తెలంగాణ గళం): ఇల్లందు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం (అక్టోబర్ 19) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎంపీడీవో కె. ధన్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకురావాలనుకునే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



