తాజా వార్తలు

ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కనకయ్య, పార్టీ శ్రేణులు.. Lakavath Sudhir: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్య…

By · · Updated

Share this article
ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కనకయ్య, పార్టీ శ్రేణులు..

Lakavath Sudhir:

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశ స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ చేసిన కృషి, స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్య, పరిశ్రమలు, శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు దేశ ప్రగతికి దోహదపడ్డాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి నెహ్రూ చేసిన కృషి భావితరాలకు ఆదర్శమని తెలిపారు.

పిల్లలపై నెహ్రూకు ఉన్న అభిమానానికి గుర్తుగా ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని, నెహ్రూ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర డేనియల్, వైస్ ఛైర్మన్ పెండేల రాజు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోళ్ల సూర్యం, రామ్ మహేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: