తాజా వార్తలు

ఇల్లందు బుగ్గవాగుకు రక్షణ కవచం!

3, 4, 5 వార్డులకు ఊరట.. రక్షణ గోడల నిర్మాణానికి నిధుల మంజూరు....నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కనకయ్య By Lakavath Sudhir: ఇల్లందు, నవంబర్‌ 7 (తెలంగాణ గళం): ఇల్లందు పట్టణంలోని 3, 4, 5 వార్…

By · · Updated

Share this article
ఇల్లందు బుగ్గవాగుకు రక్షణ కవచం!

3, 4, 5 వార్డులకు ఊరట.. రక్షణ గోడల నిర్మాణానికి నిధుల మంజూరు....నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కనకయ్య

By Lakavath Sudhir:

ఇల్లందు, నవంబర్‌ 7 (తెలంగాణ గళం): ఇల్లందు పట్టణంలోని 3, 4, 5 వార్డుల గుండా ప్రవహిస్తున్న బుగ్గవాగుకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ఇరిగేషన్‌ అధికారులతో కలిసి నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాలను పరిశీలించారు. రక్షణ గోడల నిర్మాణానికి సంబంధించిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. రక్షణ గోడల నిర్మాణంతో వాగు పరివాహక ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు తగ్గనుంది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోళ్ల సూర్యం, కౌన్సిలర్‌ అజ్మీర వంశీ, కోఆప్షన్‌ సభ్యుడు మడుగు సాంబమూర్తి, నాయకులు రవిశంకర్‌, ఏఈ రాజు, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags: