తాజా వార్తలు

హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి రద్దు

హనుమకొండ కలెక్టరేట్‌లో ఈ నెల 30న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు.వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో చేపడుతున్న అభివృద్ధి ప…

By · · Updated

Share this article
హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి రద్దు

హనుమకొండ కలెక్టరేట్‌లో ఈ నెల 30న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు.వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు చేసినప్పటికీ, జిల్లాలోని ఆర్డీవో (RDO), ఎంపీడీవో (MPDO) కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

 

హనుమకొండ రిపోర్టర్ : మోడెం సందీప్