తాజా వార్తలు

గీతాభవన్ వద్ద నలుగురు మందుబాబుల హల్‌చల్.. విద్యార్థులకు ఇబ్బందులు!

కరీంనగర్ నగరంలోని గీతాభవన్ సమీపంలో నలుగురు మందుబాబులు మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్ చేసినట్లు సమాచారం. ఒకరితో ఒకరు గొడవపడుతూ అటుగా వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేశారు. వారి ప్రవర్తనను ప్రశ్నించిన స్థ…

By · · Updated

Share this article

కరీంనగర్ నగరంలోని గీతాభవన్ సమీపంలో నలుగురు మందుబాబులు మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్ చేసినట్లు సమాచారం. ఒకరితో ఒకరు గొడవపడుతూ అటుగా వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేశారు. వారి ప్రవర్తనను ప్రశ్నించిన స్థానికులను సైతం దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో స్టడీ సర్కిల్ ఉండటంతో విద్యార్థులు, యువతీ యువకులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి ఘటనలతో విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: