తాజా వార్తలు

గంగదేవిపల్లిలో విషాదం..వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగదేవిపల్లి గ్రామ శివారులో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో ఈత కొట్టేం…

By · · Updated

Share this article

తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగదేవిపల్లి గ్రామ శివారులో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి స్వగ్రామమైన రాఘవపట్నంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ఆడెపు మధు (28), తండ్రి భూమయ్య, మంగళవారం ఉదయం వాకింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో గంగదేవిపల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు దిగాడు. ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బావిలోని రాళ్లు తలకు, మోకాలికి బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలిసింది.

ఈ ఘటనపై మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.యువకుడి మృతితో కుటుంబ సభ్యులు,బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags: