తాజా వార్తలు

ఏలేటి బుచ్చిలింగం కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్

  మెట్‌పల్లి, నవంబర్ 01,తెలంగాణ గళం:    పట్టణంలోని అరపేటకు చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలేటి నరేందర్ రెడ్డి తండ్రి ఏలేటి బుచ్చిలింగం మృతి పట్ల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అ…

By · · Updated

Share this article

 

మెట్‌పల్లి, నవంబర్ 01,తెలంగాణ గళం:

 

 పట్టణంలోని అరపేటకు చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలేటి నరేందర్ రెడ్డి తండ్రి ఏలేటి బుచ్చిలింగం మృతి పట్ల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం అరపేటలోని బుచ్చిలింగం నివాసానికి వెళ్లిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

అనంతరం ఏలేటి నరేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. బుచ్చిలింగం మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వి. అనూప్ రావు, మెట్‌పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు ధోనికెల నవీన్, కౌన్సిలర్ బోడ్ల ఆనంద్, బీజేపీ నాయకులు ధర్మపురి వేణుగోపాల్, గుంటుక సదాశివ్, లోలపు అనిల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని బుచ్చిలింగం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Tags: