తాజా వార్తలు

చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం

-ఎంజెపిలో ఘనంగా ముగిసిన అండర్ 17 బాలికల క్రీడోత్సవాలు ​కమలాపూర్, తెలంగాణ గళం: ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-17 బాలికల క్రీడోత్సవాలు 13వ…

By · · Updated

Share this article
చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం

-ఎంజెపిలో ఘనంగా ముగిసిన అండర్ 17 బాలికల క్రీడోత్సవాలు

​కమలాపూర్, తెలంగాణ గళం:

ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-17 బాలికల క్రీడోత్సవాలు 13వ తేదీన అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ పోటీల ముగింపు వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై విద్యార్థినులను ఉత్సాహపరిచారు. ​ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీవో డాక్టర్ శ్రావణ్ కుమార్, మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే వారికి క్రమశిక్షణతో పాటు అద్భుతమైన మానసిక వికాసం అలవడుతుందని తెలిపారు. ఇంతటి ఘనమైన వేడుక నిర్వహణకు, విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన సహకారం అందుతోందని కొనియాడారు. ఈ ప్రోత్సాహంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించి జీవితంలో గొప్ప స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అతిథుల ప్రసంగాల అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. అనంతరం వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నెక్కొండ పాఠశాల విద్యార్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్-17 ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు. వ్యక్తిగత విభాగంలోనూ నెక్కొండ పాఠశాలకు చెందిన అమ్ములు అనే విద్యార్థిని ఛాంపియన్‌గా నిలిచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.

​చివరగా సభాధ్యక్షులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ విద్యార్థుల వికాసానికి తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రీడోత్సవాలను ఎంతో ముందుచూపుతో, విజయవంతంగా నిర్వహించిన సెక్రెటరీ సైదులుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ​సభాధ్యక్షులు మనోహర్ రెడ్డి, ​ కమలాపూర్ మండల ఎంపీడీవో గుండె బాబు, గూడూరు గ్రామ సర్పంచ్ బండి వనజ  కళాధర్, కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, డిసిఓ స్టెల్లా, ప్రిన్సిపాల్స్ సరిత, రవీందర్, కవిత, శైలజ, వ్యాయమ ఉపాద్యాయుల తదితరులు పాల్గొన్నారు.

​

Tags: