తాజా వార్తలు

అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7,00,116 భారీ విరాళం అందించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్!

పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో నిర్మాణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి (ద్వార పాలకుల మండపం నిర్మాణం కోసం) బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌ…

By · · Updated

Share this article
అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7,00,116 భారీ విరాళం అందించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్!

పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో నిర్మాణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి (ద్వార పాలకుల మండపం నిర్మాణం కోసం) బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు రూ.7,00,116 (ఏడు లక్షల నూట పదహారు రూపాయలు) భారీ విరాళాన్ని అందజేశారు. ఈ నెల 22న జరగనున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా దేవస్థానాన్ని సందర్శించిన ఆయన, ఆలయ అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పృథ్వీరాజ్ గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకలైన దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు పేర్కొన్నారు.