తాజా వార్తలు

అపరిచితుడైనా ఆదుకున్నారు.. చింతకుంట వద్ద మానవత్వం!

కరీంనగర్: చింతకుంట వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మధ్యలో పడిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వెంటనే స్పందించి…

By · · Updated

Share this article
అపరిచితుడైనా ఆదుకున్నారు.. చింతకుంట వద్ద మానవత్వం!

కరీంనగర్: చింతకుంట వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మధ్యలో పడిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వెంటనే స్పందించి అతడిని పైకి లేపారు. అతని ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, సురక్షితంగా ఇంటికి చేరేలా సహకరించారు. అపరిచితుడికి ఆపదలో అండగా నిలిచిన వారి సేవాభావాన్ని పలువురు అభినందిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Tags: