తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన కట్ట వెంకట రమణ భార్య తరుణి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సామాజిక సేవకులు ఎడమల భోజేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.
ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు అవారి చందు పాల్గొన్నారు.
LS


