తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాపర్ ( పుప్పాల మహిపాల్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం (మాదిగ) నూతన కార్యవర్గాన్ని కుల పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా జేరిపోతుల నరేష్, ప్రధాన కార్యదర్శిగా చెవులమద్ది రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జేరిపోతుల నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కుల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం అభివృద్ధికి, సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గం వివరాలు:
- అధ్యక్షుడు: జేరిపోతుల నరేష్
- గౌరవ అధ్యక్షులు: చెవులమద్ది హన్మండ్లు, చిర్ర దిలీప్
- ఉపాధ్యక్షులు: నక్క అశోక్, జంగిలి శ్రీనివాస్
- సలహాదారుడు: చెవులమద్ది గంగాధర్
- ప్రధాన కార్యదర్శి: చెవులమద్ది రమేష్
- కోశాధికారి: చెవులమద్ది మల్లేష్
- కార్యవర్గ సభ్యులు: చెవులమద్ది మొండయ్య, నక్క విజయ్,
- ప్రచార కార్యదర్శి: చెవులమద్ది తిరుపతి
కుల పెద్దల సహకారంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


