హాస్టల్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో తండ్రి మందలింపు.. మనస్తాపంతో అఘాయిత్యం
పరకాల తెలంగాణ గళం నవంబర్ 10
హాస్టల్‌కు వెళ్లేందుకు ఇష్టపడక మనస్తాపానికి గురైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన దామెర మండలం సింగరాజుపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లికి చెందిన కుమ్మరి నాగరాజు (46) కుమారుడు కుమ్మరి మదీర్ (16) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 7వ తేదీన హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన మదీర్ తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో తండ్రి నాగరాజు మంచిగా చదువుకోవాలని సూచించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన మదీర్, తమ వ్యవసాయ బావి వద్దకు చేరుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడి తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



