పలు వివాహ వేడుకలకు హాజరైన బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ భోగ శ్రావణిప్రవీణ్
తెలంగాణ గళం,జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (పుప్పాల మహిపాల్):
జగిత్యాల నియోజకవర్గంలో గురువారం రోజున
నిర్వహించిన పలు వివాహాది శుభకార్యాలకు బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ భోగ శ్రావణిప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆయా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, శుభకార్యాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కొద్దిసేపు ముచ్చటించి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. నియోజకవర్గ ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఈ పర్యటన ద్వారా తెలియజేశారు.



