పటాన్చెరు: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ వినాయక నగర్, ఓల్డ్ ఎంఐజీ, న్యూ ఎంఐజీ కాలనీలలో ఏర్పాటు చేసిన పలు అమ్మవారి మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కాలనీలలో ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నా



