నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విద్యుత్ కిడ్స్ మరియు ఎస్పీఎస్ స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నీటిని వృథా చేయవద్దని, ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రజలకు సందేశాన్ని అందించారు.
భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ టీ. భాస్కర్, సామాజిక కార్యకర్తలు వినయ్ కుమార్, అరుణ గోగులమండ, త్రివేణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, శశిధర్, అగస్టిన్, పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.



