తెలంగాణ

వరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి

మెదక్ జిల్లా శివ్వంపేట (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్ గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించార…

By · · Updated

Share this article
వరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి

మెదక్ జిల్లా శివ్వంపేట (తెలంగాణ గళం):మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్ గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు. వెంకటేష్ గౌడ్ తల్లి వరమ్మ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా వరమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజా రమణ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ, మహేందర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Tags: