తెలంగాణ

ఉపాధి కూలీలకు అండగా దండె అపర్ణ.. పండ్లు, మంచినీళ్ల పంపిణీ

మెదక్ జిల్లా శివ్వంపేట , (తెలంగాణ గళం):శివ్వంపేట మండలంలోని నవాబుపేట, పెద్దగొట్టిముక్కల, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి దండె అపర్ణ ఉపాధి హామీ కూలీ…

By · · Updated

Share this article
ఉపాధి కూలీలకు అండగా దండె అపర్ణ.. పండ్లు, మంచినీళ్ల పంపిణీ

మెదక్ జిల్లా శివ్వంపేట , (తెలంగాణ గళం):శివ్వంపేట మండలంలోని నవాబుపేట, పెద్దగొట్టిముక్కల, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి దండె అపర్ణ ఉపాధి హామీ కూలీలకు అండగా నిలిచారు. ఎండలో కష్టపడి పనిచేస్తున్న నిరుపేద కూలీల దాహార్తిని తీర్చేందుకు పండ్లు, మంచినీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కూలీలు పనిచేస్తున్న ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కూలీలకు పండ్లు, మంచినీళ్ల బాటిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా దండె అపర్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఉపాధి హామీ కూలీల పాత్ర కీలకమని అన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న కూలీలకు తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లప్పుడూ నిరుపేదలు, కార్మికుల పక్షాన నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.కష్టపడుతున్న తమను గుర్తించి స్వయంగా వచ్చి పండ్లు, మంచినీళ్లు పంపిణీ చేయడంపై కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Tags: